భూ హద్దులు పక్కాగా.. రికార్డులు పారదర్శకంగా!

ఫతేపూర్‌లో రీ సర్వే పనులను పరిశీలించిన

తహసీల్దార్ అజ్మత్ నవాజ్

సాలూర 08 ద్రోణ:- భూ రికార్డుల క్రమబద్ధీకరణలో భాగంగా సాలూర మండలంలోని ఫతేపూర్ గ్రామంలో కొనసాగుతున్న రీ సర్వే పనులను తహసీల్దార్ అజ్మత్ నవాజ్ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సర్వే జరుగుతున్న తీరును పరిశీలించిన ఆయన, రైతులకు ఎలాంటి అనుమానాలు, అభ్యంతరాలు తలెత్తకుండా సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ప్రతి పట్టాదారు భూమికి సంబంధించిన హద్దులను కచ్చితంగా గుర్తించి, భూ వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. రీ సర్వే ద్వారా భూ రికార్డులు క్రమబద్ధీకరించడంతో పాటు భవిష్యత్‌లో భూ వివాదాలకు అవకాశం లేకుండా చూడవచ్చని తెలిపారు. రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకుని, ఏవైనా సమస్యలు ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన, క్రమబద్ధీకరణకు ప్రాధాన్యం ఇస్తోందని తహసీల్దార్ పేర్కొన్నారు. గ్రామస్థులు, రైతుల సహకారంతో రీ సర్వేను సమర్థవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో బోధన్ డివిజనల్ ఇన్‌స్పెక్టర్, ఫతేపూర్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మండల గిర్దావర్ శంకర్, సర్వేయర్ శ్రవణ్ కుమార్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular