రూ.100 కోట్లకు పైగా ఆస్తులా?

సివిల్ సప్లైస్ మేనేజర్‌పై ఏసీబీ తనిఖీలు..

28 ఎకరాల భూమి, పలు భవనాలు గుర్తింపు

మహబూబాబాద్, అక్టోబర్ 10(ద్రోణ):- జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ వాసంశెట్టి నరసింహారావుకు సంబంధించిన ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదులు అందడంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో రెండుసార్లు సస్పెన్షన్‌కు గురైన నరసింహారావుపై తాజాగా ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు ఆస్తుల వివరాలను పరిశీలించారు. ఖమ్మం, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాల్లో కలిపి 28 ఎకరాల భూమి, ఐదు ప్లాట్లు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఖమ్మం, హైదరాబాద్ నగరాల్లో భవనాలు ఉన్నట్లు కూడా తనిఖీల్లో వెల్లడైనట్లు తెలుస్తోంది. వీటితో పాటు 361 గ్రాముల బంగారం, సుమారు రూ.33 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములు, ప్లాట్లు, భవనాలు, బంగారం, వెండి తదితర ఆస్తుల మొత్తం మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు తెలిసింది. అయితే, ఈ ఆస్తుల విలువ, వాటి కొనుగోలుకు ఉపయోగించిన నిధుల మూలాలు, ఆదాయానికి మించిన ఆస్తులున్నాయా అనే అంశాలపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. ఏసీబీ దర్యాప్తులో వెల్లడయ్యే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular