బోధన్ అక్టోబర్ 9 ద్రోణ:-
బోధన్ పట్టణ శివారులోని ఇందూరు పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

ఇందూర్ పాఠశాలలో విద్యతో పాటు సాంస్కృతి కార్యక్రమాల్లో సైతం ఎప్పుడూ ముందంజలో ఉంటారు. సామాజిక సేవలో సైతం పాఠశాల యాజమాన్యం తమ స్థానాన్ని నిలుపుకుంటూ వస్తుంది. దసరా సెలవులు రావడంతో పాఠశాల యాజమాన్యం ముందస్తుగా బతుకమ్మ వేడుకలను ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఉపాధ్యాయులు బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతూ సందడి చేశారు.ఈ వేడుకల్లో స్థానిక కౌన్సిలర్ వేములపల్లి రామ్మూర్తి లక్ష్మి పాల్గొని బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఆడపడుచులు ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు.ఇందూరు హైస్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఇందూరు విద్యాసంస్థల డైరెక్టర్ కొడాలి సాయి విపంచి,హితిష్ పాల్గొన్నారు.