ఇందూరు హైస్కూల్‌లో సంప్రదాయాల సందడి

బతుకమ్మల చుట్టూ విద్యార్థినుల ఆటపాటలు..

తెలంగాణ సంస్కృతిని చాటిన వేడుకలు

బోధన్‌, అక్టోబర్ 09(ద్రోణ):- పట్టణంలోని ఇందూరు హైస్కూల్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో పాఠశాల యాజమాన్యం ముందస్తుగా బతుకమ్మ వేడుకలను ఏర్పాటు చేసింది. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సందడి చేశారు. బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ వేములపల్లి రామ్మూర్తి లక్ష్మి హాజరై బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

అనంతరం ఇందూరు హైస్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు బతుకమ్మ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇందూరు విద్యాసంస్థల డైరెక్టర్లు కొడాలి సాయి విపంచి, హితిష్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular