ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ కూటమి హవా!

దాదాపు 4,500 ఓట్ల మెజారిటీతో విజయం

సాధించినట్లు సమాచారం..

రాష్ట్రంలో అతిపెద్ద గుర్తింపు

సంఘంగా అవతరించే అవకాశం

నిజామాబాద్, అక్టోబర్ 10(ద్రోణ):- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) నేతృత్వంలోని కూటమి ఆధిక్యం సాధించినట్లు సమాచారం. ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ కలిసి పోటీ చేసిన కూటమి దాదాపు 4,500 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించినట్లు తెలుస్తోంది. ఈ ఫలితంతో రాష్ట్రంలో అతిపెద్ద గుర్తింపు సంఘంగా ఈయూ కూటమి నిలిచే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగిన తెలంగాణ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ) కూటమికి ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితం దక్కలేదని సమాచారం. పదేళ్ల విరామం తర్వాత జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. అయితే, బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈ నెల 17న తుది ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు. అప్పటివరకు కూటముల వారీగా వచ్చిన ఆధిక్యంపై వెలువడుతున్న సమాచారం అనధికారికంగానే పరిగణించాల్సి ఉంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular