పదేళ్లలో 10 జిల్లాల నుంచి 33 జిల్లాలకు తెలంగాణ: కేటీఆర్‌

అధికార వికేంద్రీకరణతో ప్రజలకు పాలన చేరువైందని వెల్లడి

హైదరాబాద్‌, అక్టోబర్ 10(ద్రోణ):- తెలంగాణలోని జిల్లాలో పునర్వ్యవస్థీకరణ చేపట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా బీ,ఆర్‌,ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. గతంలో ఉన్న 10 జిల్లాలను అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించిందని తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణకు ప్రాధాన్యం లభించిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వైద్య, విద్యా సదుపాయాలు ప్రజలకు మరింత చేరువయ్యాయని వివరించారు. పాలనా వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సంక్షేమ పథకాలను గడపగడపకు చేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. జిల్లాల సంఖ్య పెంపుతో పరిపాలనలో వచ్చిన మార్పులు, ప్రజలకు అందిన సేవలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ పదేళ్ల ప్రయాణాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular