నిరసనకు మద్దతు..

యూట్యూబర్‌ ధ్రువ్‌
మద్దతు..

గురుగ్రామ్‌ నివాసానికి చేరుకున్న

50 మంది పోలీసుల బృందం..

అదుపులోకి తీసుకున్నట్లు కథనాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 10ద్రోణ:- ప్రముఖ యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ చుట్టూ పోలీసుల చర్యలతో చర్చ మొదలైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద తలపెట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపిన నేపథ్యంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 56లో ఉన్న ఆయన నివాసానికి సుమారు 50 మంది పోలీసులతో కూడిన బృందం చేరుకున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సీఈసీ రాజీనామా చేయాలని కోరుతూ సీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి ధ్రువ్‌ రాఠీ మద్దతు ప్రకటించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన నివాసం వద్ద పోలీసుల బృందం చేరుకోవడం, అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

నిరసన చుట్టూ ఉత్కంఠ

జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన నిర్వహణకు సంబంధించి పోలీసుల అనుమతి, ఆందోళనకారులపై తీసుకున్న చర్యలపై స్పష్టత రావాల్సి ఉంది. ధ్రువ్‌ రాఠీని అదుపులోకి తీసుకోవడానికి గల నిర్దిష్ట కారణాలు, తదుపరి చర్యలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ పరిణామం సామాజిక మాధ్యమాల్లోనూ చర్చకు దారితీసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular