సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు 25 పోస్టులు..
నెలకు రూ.33,800 వేతనం
హైదరాబాద్, అక్టోబర్ 12(ద్రోణ):- సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు తెలంగాణ హౌసింగ్ బోర్డు పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల ప్రాజెక్టులో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ప్రాజెక్టు అవసరాల కోసం అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) విభాగంలో 25 పోస్టులను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.

బీఈ లేదా బీటెక్ (సివిల్) ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికైన వారికి నెలకు రూ.33,800 వేతనం చెల్లించనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో పోస్టింగ్ ఇవ్వనున్నారు. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 21లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తు విధానం, అధికారిక వెబ్‌సైట్, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలను సంబంధిత నియామక ప్రకటనలో పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.