డాలర్‌పై రూపాయి జోరు..

ఒక్కరోజే 98 పైసల లాభం!

ఆర్బీఐ చర్యలతో బలపడిన దేశీయ కరెన్సీ..

ఆరంభంలో దూసుకెళ్లి తర్వాత తగ్గిన స్టాక్‌ మార్కెట్లు

హైదరాబాద్, అక్టోబర్ 12(ద్రోణ)- అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ సోమవారం భారీగా పుంజుకుంది. డాలర్‌ డిమాండ్‌ను నియంత్రించేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) చర్యలను వేగవంతం చేయడంతో రూపాయి విలువ ఒక్కరోజే 98 పైసలు బలపడింది. దీంతో డాలర్‌ విలువ రూ.96.73 నుంచి రూ.95.75కు దిగివచ్చింది.

మరోవైపు దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రారంభంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 380 పాయింట్ల మేర లాభపడగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సుమారు 120 పాయింట్లు ఎగసింది. అయితే ఆ తర్వాత మార్కెట్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో సూచీలు తిరిగి దిగివచ్చాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పెరగడం విదేశీ మారకపు మార్కెట్లో కీలక పరిణామంగా నిలిచింది. అయితే రూపాయి బలపడిన ప్రభావం దిగుమతుల వ్యయం, ద్రవ్యోల్బణం, స్టాక్‌ మార్కెట్లపై ఎలా ఉంటుందన్నది తదుపరి పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular