Thursday, October 15, 2026

పశువుల కొవ్వుతో కల్తీ నూనె తయారీ!

బోధన్‌లో పోలీసుల దాడి..

900 లీటర్లు స్వాధీనం

ముగ్గురు అదుపులో…

మహారాష్ట్ర కూడా సరఫరా చేస్తున్నట్లు గుర్తింపు

బోధన్, అక్టోబర్ 14 (ద్రోణ): ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారేలా పశువుల కొవ్వు, ఎముకలు, తోళ్లతో నూనె తయారు చేస్తున్న అక్రమ వ్యవహారాన్ని పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఈ కేంద్రంపై చీతా ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ సందర్భంగా 900 లీటర్ల నూనెను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. గాంధీనగర్‌లోని మహమ్మద్ సఫీఉద్దీన్ నివాసంలో పశువుల కొవ్వు, ఎముకలు, తోళ్లను వేడి చేసి నూనె తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ తయారుచేసిన నూనెను మహారాష్ట్రకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. దాడిలో మహమ్మద్ సఫీఉద్దీన్, మహమ్మద్ సోఫిఉద్దీన్, అబ్దుల్ అన్వర్‌లను అదుపులోకి తీసుకున్నారు.

ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలు

కల్తీ ఉత్పత్తుల తయారీ, విక్రయాలు, అక్రమ నిల్వలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ దాడిలో చీతా టీమ్ ఎస్‌ఐ శ్రీను, బోధన్ ఎస్‌ఐ రామ్‌తో పాటు ఇరు బృందాల సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular