Thursday, October 15, 2026

ఘట్కేసర్‌ సీఐ బాలస్వామి సస్పెన్షన్‌?

సివిల్‌ వివాదాల్లో జోక్యం,

అవినీతి ఆరోపణలపై విచారణ..

అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది
ఘట్కేసర్‌, అక్టోబర్ 15(ద్రోణ):- ఘట్కేసర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలస్వామి పై సస్పెన్షన్‌ వేటు పడినట్లు సమాచారం. సివిల్‌ వివాదాలలో జోక్యం చేసుకోవడం, అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ సుమతి ఆదేశాలతో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో సీఐ ను సస్పెండ్‌ చేసినట్లు పోలీసు వర్గాలలో ప్రచారం జరుగుతోంది.

అయితే, సీఐ సస్పెన్షన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇది లా ఉండగా, గతంలోనూ ఘట్కేసర్‌ సీఐ గా పనిచేసిన ఓ అధికారి దసరా సమయంలోనే సస్పెన్షన్‌కు గురికావడం గమనార్హం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular