నర్సాపూర్లో కలకలం.. మరో 19 మందికి అస్వస్థత
నర్సాపూర్, అక్టోబర్ 15(ద్రోణ):- మెదక్ జిల్లా నర్సాపూర్లో కలుషిత ఆహారం తిన్న ఘటనలో 19 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా ఓ రెస్టారెంట్లో మండి బిర్యానీ తిన్న తర్వాత వీరంతా అనారోగ్యానికి గురైనట్లు సమాచారం.
రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో సాయిరామ్ (19) పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.

ఆహారం కలుషితం కావడమే ఘటనకు కారణమా? రెస్టారెంట్ లో ఆహార నాణ్యత, పరిశుభ్రత, ప్రమాణాలు పాటించారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. సంబంధిత అధికారులు విచారణ చేపట్టి, ఘటనకు గల కారణాలను నిర్ధారించాల్సి ఉంది.
