రైతుల విద్యుత్ అవసరాల కోసం ₹10.30 కోట్లతో సబ్‌స్టేషన్లు

3–4 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలని

అధికారులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదేశం

జుక్కల్, అక్టోబర్ 18(ద్రోణ):- రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా జుక్కల్ నియోజకవర్గంలో నాలుగు 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదివారం భూమిపూజ చేశారు. బ్రాహ్మణ్‌పల్లి–ఆరేపల్లి, కాటేపల్లి, లచ్చన్, తడ్గూర్ గ్రామాల్లో మొత్తం రూ.10.30 కోట్ల అంచనా వ్యయంతో ఈ సబ్‌స్టేషన్లను నిర్మించనున్నారు.

వ్యవసాయ అవసరాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించడం, సాగు పనులకు ఆటంకాలు కలగకుండా చూడటమే ఈ నిర్మాణాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటుతో ఆయా గ్రామాల రైతులకు విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడే అవకాశం ఉంది. సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులను మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ఎమ్మెల్యే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం జరగకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులో నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular