సమ్మెకు జిల్లా ఆయుష్ మద్దతు
నిజామాబాద్, అక్టోబర్ 18(ద్రోణ):-: జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు జిల్లా ఆయుష్ ఉద్యోగుల తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఆయుష్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు న్యావనండి పురుషోత్తం పటేల్ మాట్లాడుతూ, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, వారి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ సుబూర్, డాక్టర్ ఉమా, ఫార్మసిస్టులు బాబురావు, నవనీత, ఆయుష్ ఉద్యోగులు బిక్షపతి, సుజాత, ఆస్మా, వేగం సురేందర్, రమేష్ తదితరులు పాల్గొని సమ్మెకు సంఘీభావం తెలిపారు. అలాగే ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు సందీప్, విశాల, నారాయణతో పాటు పలువురు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్ల సాధన కోసం నిరసన వ్యక్తం చేశారు.