నేర చరిత్రలో ఓ అధ్యాయం…
అక్టోబర్ 18, 2004న ఎస్‌టీఎఫ్ ఆపరేషన్‌లో హతం
నిజామాబాద్ / ప్రత్యేక కథనం 18 అక్టోబర్(ద్రోణ) :-
గంధపు చెట్ల అక్రమ రవాణా, ఏనుగుల వేట, కిడ్నాప్‌లతో దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు తీవ్ర సంచలనం సృష్టించిన అటవీ నేరగాడు వీరప్పన్ వర్ధంతి నేడు. 2004 అక్టోబర్ 18న తమిళనాడు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) నిర్వహించిన ఆపరేషన్‌లో వీరప్పన్ మరణించాడు.

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల అటవీ ప్రాంతాల్లో దాదాపు మూడు దశాబ్దాల పాటు కార్యకలాపాలు సాగించిన వీరప్పన్.. గంధపు చెట్ల అక్రమ రవాణా, ఏనుగుల వేట, కిడ్నాప్‌లు, హత్యలతో అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. అతని కార్యకలాపాల కారణంగా అటవీ సంపదకు, వన్యప్రాణులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పోలీసు, అటవీ శాఖ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, పలువురు ప్రముఖుల అపహరణ ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వీరప్పన్ నేర చరిత్ర అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది. ప్రకృతి సంపదను కాపాడటం ప్రభుత్వాలకే పరిమితం కాకుండా ప్రతి పౌరుడి బాధ్యతగా గుర్తించాలి. అడవుల విధ్వంసం, వన్యప్రాణుల వేటను అరికట్టేందుకు సమాజమంతా కృషి చేయాలి.