రైతులకు సేవలందించడమే లక్ష్యం..
ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు
బోధన్, అక్టోబర్ 18 (ద్రోణ):-
సాలూర మండలం జాడి జమాల్‌పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా మల్లవరపు సుందర్ రాజు నియమితులయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డిని ఆదివారం ఆయన నివాసంలో గ్రామ కాంగ్రెస్ నాయకులతో కలిసి సుందర్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేశారు. తన నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు సేవలందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నూతన చైర్మన్‌కు సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పనిచేయాలని ఆకాంక్షించారు.
నూతన చైర్మన్ సుందర్ రాజు మాట్లాడుతూ, రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన రైతులకు అందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు వైట్ల శ్రీనివాసరావు, చిలక బాబు, నాయకులు బలరామ్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
