మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి
ఢిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ భారీ బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ శ్రీమతి ప్రియాంక గాంధీ తో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏనుముల రేవంత్ రెడ్డి , TPCC అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఇతర రాష్ట్ర, జాతీయ నాయకులు పాల్గొన్న సభలో బాన్సువాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి బాన్సువాడ నుండి సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి హాజరయ్యారు.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ, ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను కాపాడాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ఇండియా కూటమికి చెందిన వివిధ పార్టీల జాతీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.



