
వ్యాపారులకు హెచ్చరిక!
కిలో బియ్యం రూ.66 నుంచి రూ.79 వరకు గరిష్ట ధరలు
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవన్న అదనపు కలెక్టర్
నిజామాబాద్ నవంబర్ 02 (ద్రోణ):- బియ్యం విక్రయాలల్లో వినియోగదారులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరలను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ త్రిపాటి స్పష్టం చేశారు. నిర్దేశించిన ధరలను మించి బియ్యం విక్రయించినా, వినియోగదారుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేసినా సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యం సరసమైన ధరలకు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ధరలను నిర్దేశించినట్లు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ త్రిపాటి ఆదేశాల మేరకు జిల్లాలో బియ్యం విక్రయాలపై పర్యవేక్షణ చేపడుతున్నట్లు వెల్లడించారు. రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు, డిపో నిర్వాహకులు, చిల్లర వర్తకులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ట ధరల ప్రకారం తెలంగాణ బిపిటి బియ్యం కిలో రూ.66, తెలంగాణ సోనా బియ్యం కిలో రూ.74, తెలంగాణ శ్రీరామ గోల్డ్ బియ్యం కిలో రూ.79కు విక్రయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ధరలకు మించి విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
వినియోగదారులకు ధరలపై అవగాహన కల్పించేందుకు ప్రతి బియ్యం విక్రయ కేంద్రం వద్ద ప్రభుత్వం నిర్ణయించిన ధరలను స్పష్టంగా కనిపించేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధరల విషయంలో పారదర్శకత పాటిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యాపారులు సహకరించాలని అదనపు కలెక్టర్ ను కోరారు.