హంతకునికి జీవిత ఖైదు

ముద్దాయికి జీవితఖైదు నిజామాబాద్ సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తీర్పు

నిజామాబాద్ అక్టోబర్ 27 ద్రోణ

భూతు మాటలు తిట్టిండని ఒక వ్యక్తిని హత్య చేసిన కేసులో ముద్దాయి బైరి నర్సగౌడ్ కు జీవిత కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీ.వి.ఎన్ భారత లక్ష్మీ బుధవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాలు ఈ విదంగా ఉన్నాయి. తాటిపాముల శివప్రసాద్ గౌడ్ , బైరి నర్సాగౌడ్ నిజామాబాద్ రూరల్ మండలం కొత్తపేట మల్కాపూర్ గ్రామ వాస్తవ్యులు. 2024 జూన్ 06 న ఉదయం ఆరు గంటలకు శివప్రసాద్ దైవ దర్శనం చేసుకుందామని వెలుతుండగా మార్గమద్యలో నర్సాగౌడ్ ఎదురు పడటంతో తనను ఉద్దేశించి శివప్రసాద్ భూతుమాటలు తిట్టిండు అని కోపగించి దగ్గరలో ఉన్న కట్టేతో తలపై కొట్టి గాయపరచాడు. తనను చెప్పుకోలేని భూతుమాటలు తిట్టాడని మనసులో రగిలిపోయిన మరింత కోపం తెచ్చుకున్న నర్సాగౌడ్ మల్లి మధ్యాహ్నం మూడు గంటలకు శివప్రసాద్ ఇంటికి వెల్లి వెంటతెచ్చుకున్న కట్టేతో బలంగా తలపై ఇతర శరీర బాగాలపై తీవ్రంగా కొట్టడంతో గాయలపాలైన అతనిని కటుంబ సభ్యులు నిజామాబాద్ నగరంలోని ప్రగతి ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తరువాత అతన్ని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లడంతో శివప్రసాద్ బతికే అవకాశాలు లేవని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్లారు. ఇంటికి వెళ్లిన తరువాత అతను మరణించాడని వారు తెలపడంతో పోలీసులు వైద్యులచే పోస్ట్ మార్టమ్ నిర్వహింప జేశారు.
సమగ్ర నేర విచారణ అనంతరం పోలీసు అధికారులు చార్జీషీట్ ను కోర్టులో సమర్పించారు. నేర న్యాయ విచారణలో భాగంగా చార్జీషీట్ అనుసారం 21 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన సెషన్స్ కోర్టు 19 ధ్రువీకరించుకున్న పత్రాలు మరొక వస్తుగత సాక్ష్యాన్ని మార్క్ చేసుకుని ప్రాసిక్యూషన్ , డిఫెన్స్ న్యాయవాది వాదనలు విన్నారు. ముద్దాయి నర్సాగౌడ్ పై హత్య నేరం రుజువు అయినట్లు నిర్దారించింది.హత్యనేరంకుగాను జీవిత ఖైదుతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విదిస్తూ సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాలి జడ్జి తమ తీర్పులో పేర్కొన్నారని పిపి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
నిందితునికి శిక్ష పడడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఇన్వెస్టిగేషన్ అధికారులు జె . రామారావు , ఎస్.ఐ , జి . మహేష్ , ఎస్.ఐ , ఎస్. సతీష్ సి.ఐ , సురేష్ కుమార్ సి.ఐ , పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి , బ్రీఫింగ్ ఆఫీసర్ సి. హెచ్ . శ్రీనివాస్ సి.ఐ , నిజామాబాదు రూరల్ పి. యస్ , గోవింద్ ఎస్ఐపి కోర్టులైజన్ ఆఫీసర్ , కోర్టు సీఎంఎస్ మరియు సిడిఓ లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య ప్రశంసిస్తూ అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular