పాడి పంటలు సమృద్ధిగా పండాలని గ్రామ దేవతలకు మొక్కులు

సలనంబాలు, బోనాలతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు

నవీపేట్, నవంబర్ 2 (ద్రోణ):- నవీపేట్ మండల కేంద్రంలో గాండ్ల తేలుకుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సలనంబాలు, బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ ఆచారాల నడుమ జరిగిన ఈ వేడుకలు గ్రామంలో ఆధ్యాత్మిక సందడిని నింపాయి.

ఈ సందర్భంగా భాజా భజంత్రీల నడుమ సలనంబాలు, బోనాలను ఎత్తుకొని భక్తులు ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు చేరుకున్నారు. అనంతరం గ్రామ దేవతలకు సలనంబాలు, బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవార్లను వేడుకున్నారు.

బోనాల పండుగతో నవీపేట్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకలల్లో కుల సంఘం ప్రతి నిధులు, పెద్దలు, మహిళలు, యువతీ యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో పునాది అంజయ్య, వార్డు సభ్యుడు బునాది నవీన్, బునాది మంజుల ప్రవీణ్, దేవేందర్, శ్రీనివాస్, రవి, చందు, రాజమణి, సునంద, సావిత్రి, సుజాత, సుకృత, రచన, రాధికతో పాటు కుల సంఘ పెద్దలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: ఎం. నాగేశ్వరరావు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular