
మద్నాపూర్‌లో గోశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
మద్నాపూర్, నవంబర్ 2( ద్రోణ):- గో సంరక్షణకు ప్రాధాన్య మిస్తూ అనూసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన గోశాలను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ తాలూకా మద్నాపూర్ గ్రామంలోని గంగేశ్వర్ మహారాజ్ ఆశ్రమంలో ఈ గోశాలను నిర్మించారు.
ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తన సొంత నిధులతో గోశాల నిర్మాణానికి రూ.35 లక్షలు వెచ్చించారు. సోమవారం ఉదయం గోశాలను ప్రారంభించిన అనంతరం గంగేశ్వర్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా గో సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గోవుల పరిరక్షణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, గోవులను పెంచడం ద్వారా వాటి సంరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. గోశాల నిర్మాణం ద్వారా గోవులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వాటి సంరక్షణకు అవసరమైన వసతులు అందుబాటులోకి రానున్నాయి.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ మహారాజ్‌లు, మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి, నాయకులు చక్రధర్ పటేల్, వెంగల్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.