సాలంపాడ్ సొసైటీ పగ్గాలు చేపట్టిన వీరంరెడ్డి

రైతుల సంక్షేమానికి కృషి చేస్తా: వీరంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి

బోధన్ టౌన్, నవంబర్ 2 (ద్రోణ): నిజామాబాద్ జిల్లా సాలూర మండలం సాలంపాడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్‌ పర్సన్‌గా నియమితులైన వీరంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సోమవారం సంఘ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంఘ పరిధిలోని రైతులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, వివిధ సహకార సంఘాల చైర్మన్లు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వీరంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి రైతులకు సేవ చేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తానని, సహకార సంఘం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సాలూర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందర్న రవి, వివిధ సహకార సంఘాల చైర్మన్లు, మాజీ చైర్మన్లు, సర్పంచ్‌లు, గ్రామ పెద్దలు, రిటైర్డ్ సీఈవో బస్వంతరావు పటేల్, సంఘ సీఈవో కార్ల శ్రీనివాస్, సంఘ పాలకవర్గ సభ్యులు ఆవుల పద్మారెడ్డి, గైని పెద్ద గంగారం, శీలం భాస్కర్ రెడ్డి, మద్దినేని శ్రీనివాసరావు, కామిరెడ్డి రమణారెడ్డి, తూము వెంకటేశ్వర్ రెడ్డి, బేకరీ లక్ష్మీ, మేడం భారతీదేవి, చెరుకుపల్లి శ్రీనివాసరావు, ఉస్కె గంగారాం, బాలకృష్ణారెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి ఉమ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు, సంఘ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: ఎం. నాగేశ్వరరావు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular