ఎనిమిది నెలలుగా వేతనాల కోసం ఎదురుచూపులు!

పెండింగ్ జీతాలు విడుదల చేయాలని తహసీల్దార్‌కు ఒకేషనల్ ఉపాధ్యాయుల వినతి

సాలూర, నవంబర్ 03 (ద్రోణ):- ప్రభుత్వ పాఠశాలల్లో ఔట్‌ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఒకేషనల్ ఉపాధ్యాయులకు గత ఎనిమిది నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ మంగళవారం సాలూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఒకేషనల్ ఉపాధ్యాయులు మండల తహసీల్దార్ అజ్మత్ నవాజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. నెలల తరబడి జీతాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని, రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి సైతం ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు వేల మంది ఒకేషనల్ ఉపాధ్యాయులు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందిస్తున్నప్పటికీ, వేతనాల చెల్లింపులో జాప్యం జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వానికి నివేదించి, నిలిచిపోయిన ఎనిమిది నెలల వేతనాలను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మేడి రవి, యాదవ్ అక్షయ్, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఫోటో రైటప్: ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని కోరుతూ తహసీల్దార్ అజ్మత్ నవాజ్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఒకేషనల్ ఉపాధ్యాయులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular