బియ్యం ధరలు గీత దాటితేజైలు పాలే

తెలంగాణ రాష్ట్రంలో వరి పంట నిజాంబాద్ జిల్లాలో విస్తారంగా పండినప్పటికీ బియ్యం ధరలు ఆకాశాన్ని అంటాయి. దేశంలోనే ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుందన్న సాకుతో వ్యాపారులు ఆహార ధాన్యాల ధరలకు రెక్కలు తెచ్చారు. ప్రస్తుత ఖరీఫ్లో పండించిన వరి ధాన్యం సైతం కొండెక్కింది. పరిస్థితులను చక్కబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిద్ర నుండి మేల్కొంది. బియ్యం ధరలను అరికట్టేందుకు చకచకా ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం ధరలను నియంత్రించేందుకు విక్రయించేందుకు ధరలను ప్రకటించడంతోపాటు కఠిన చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం పావులు కదపడం ప్రారంభించింది. అధికార యంత్రాంగం చర్యల వల్ల ధాన్యం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. మంచి నాణ్యత గల వడ్లు 15 రోజుల క్రితం క్వింటాలుకు 3500 నుండి 3800 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. గత నాలుగు రోజుల నుండి 2900 నుండి 3200 వరకు ధాన్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. బియ్యం ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు దెబ్బలు ఎత్తారు. ఆహార ధాన్యాల కొరత ఏర్పడబోతుందన్న ప్రచారాన్ని వ్యాపారులు పెద్ద ఎత్తున చేపట్టారు. వ్యాపారుల వద్ద ఆహార దాన్నే పాత నిల్వలను అధిక ధరలకు అమ్ముకునే ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ చర్యల వల్ల వ్యాపారులకు ముకు తాడు వేయగలిగారు.

అధిక ధరలకు బియ్యం అమ్మకాలు చేపడితే జైలుకె

కోటగిరి, నవంబర్ 5, ద్రోణ

తెలంగాణ రాష్ట్రంలో బియ్యం అమ్మకాల ధరల నియంత్రణ పట్ల ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ధరల నియంత్రణ కోసం ప్రత్యేక టీం లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే బియ్యం దుకాణాల్లో తనిఖీలు చేపట్టడం వారిపై కేసులను నమోదు చేయడం లాంటి చర్యలను తీసుకున్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ధరల నియంత్రణ పట్ల తీసుకోవాల్సిన చర్యల గురించి మిల్లర్లకు, బియ్యం వ్యాపారులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం బియ్యం అమ్మకాల పట్ల ప్రత్యేక జీవో సైతం జారీ చేసింది. నిబంధనలు అతిక్రమించి బియ్యం అమ్మకాలు చేపడితే వ్యాపారులను జైలుకు సైతం పంపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంత జరుగుతున్న కొంతమంది వ్యాపారులు నిబంధనలను అతిక్రమించి పాత నిలువల పేరిట సొమ్ము చేసుకునేందుకు సాహసం చేయబోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో వరి పంట విస్తారంగా పండినప్పటికీ, ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటగిరి మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని అధికారులు నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కోటగిరి ఎమ్మార్వో గంగాధర్ హెచ్చరించారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించి తమ వ్యాపారాలను సాఫీగా కొనసాగించుకోవాలని సూచించారు. రైస్ మిల్లర్లకు ఇబ్బందులను సైతం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే బియ్యం అమ్మకాలు చేపట్టాలని ఎంతటి వారైనా సరే నిబంధనలో అతిక్రమిస్తే శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సివిల్ సప్లై డిటి హనుమంతు హెచ్చరించారు. మిల్లర్లు సైతం ప్రభుత్వ సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించకుండా బియ్యాన్ని సివిల్ సప్లై శాఖకు అందించాల్సి ఉంటుందన్నారు. తప్పులు చేస్తే మిల్లర్లు జైలు పాలు అవుతారని, ఇప్పటికే ప్రభుత్వ సొమ్ము స్వాహా చేసిన వారు ఎంతో మంది జైలు పాలయ్యారని, అటువంటి పరిస్థితులను రైస్ మిల్లర్లు తెచ్చుకోవద్దని సూచించారు. రైస్ మిల్లులు, బియ్యం షాపులను తనిఖీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిందని, జిల్లాలో ఉండే అధికారులకు సైతం వారు సమాచారం ఇవ్వాలని, ప్రతినిత్యం మార్కెట్లో తిరుగుతూ అక్రమాలపై కొరడా కల్పిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోతంగల్ తహసిల్దార్, ఉమ్మడి మండలాల రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు శంకర్ పటేల్, కార్యదర్శి నిశాంత్ సెట్, శ్రీనివాస్ రెడ్డి, మల్లాది రంగబాబు, పలువురు రైస్ మిల్లర్లు, బియ్యం వ్యాపారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular