- ఉత్సవాలకు హాజరుకావాలని కోరిన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు

హైదరాబాద్, నవంబర్03(ద్రోణ):- పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మది
నాన్ని పురస్కరించుకుని ఈ నెల 23న నిర్వహించనున్న శత జయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతి నిధులు మంగళవారం ముఖ్య మంత్రిని కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్.జి. చలం తదితర సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై, పుట్టపర్తిలో నిర్వహించనున్న శతజయంతి వేడుకల విశేషాలను వివరించారు. ఈ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.