ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణం

డిచ్ పల్లి, నవంబర్ 04(ద్రోణ::- అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ ఆటో డ్రైవర్ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. దుస్గం గ్రామానికి చెందిన గొల్ల రవీందర్ (39) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

కొంత కాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనకు గుండెలో స్టెంట్ వేయడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ క్రమంలో కుటుంబ సభ్యులంతా బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో ఇంటిలో ఒంటరిగా ఉన్న రవీందర్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతుడి భార్య గొల్ల శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular