పేకాట స్థావరాలపై ప్రత్యేక నిఘా

దీపావళి వేళ పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు!

మూడు పోలీస్ డివిజన్ల పరిధిలో ప్రత్యేక నిఘా..

స్పెషల్ టీమ్‌ల ఏర్పాటు

నిజామాబాద్, నవంబర్ 4(ద్రోణ):- దీపావళి పండుగ నేపథ్యంలో పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య హెచ్చరించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ మూడు డివిజన్ లో పేకాట పై పూర్తి స్థాయి నిషేధం అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

పండుగను ఆసరాగా చేసుకుని కొందరు పేకాట స్థావరాలు ఏర్పాటు చేయడం, రహస్యంగా ఆటలు నిర్వహించడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించడంతో పాటు అన్ని ప్రాంతాలల్లో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

పేకాట ఆడేవారితో పాటు స్థావరాలు నిర్వహించేవారు, ఇతరులను ప్రోత్సహించేవారు, నిర్వహణకు సహకరించే వారి పై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, పేకాట నిర్వహణ పై సమాచారం అందిన వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రజలు తమ పరిసర ప్రాంతాలలో పేకాట నిర్వహణకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఇందుకోసం పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659700 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.

ప్రజలు పోలీసులకు సహకరించి దీపావళి పండుగను ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular