జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రస్థాయి కార్యాచరణ

హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల సాధనకు ఉద్యమ కార్యాచరణ…

టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర కమిటీ తీర్మానం

హైదరాబాద్, నవంబర్ 5(ద్రోణ):- రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమష్టిగా పోరాటం చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ముఖ్యంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డుల మంజూరు, ఇళ్ల స్థలాల కేటాయింపుతో పాటు వివిధ జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తీర్మానించింది.
హైదరాబాద్‌లోని శుభం హోటల్‌లో మంగళవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, జిల్లాల వారీగా పరిష్కారానికి నోచుకోని అంశాల పై విస్తృతంగా చర్చించారు.

సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జాతీయ నాయకులు అమర్, సత్యనారాయణ, వాజిద్, నరేందర్, రాష్ట్ర కార్యదర్శి రామ్ నారాయణతో పాటు వివిధ జిల్లాల యూనియన్ అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన డిమాండ్ సాధన కోసం రాష్ట్రస్థాయిలో ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్ జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular