రైతు వేదికగా ఆధునిక సాగుపై చైతన్యం

ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు

రైతులకు శాస్త్రీయ వ్యవసాయంపై

అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు

సాలూర, నవంబర్ 06( ద్రోణ):- వ్యవసాయాన్ని లాభ సాటిగా మార్చుకోవడంతో పాటు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు ఆధునిక సాగు పద్ధతులను అనుసరించాలని వ్యవసాయ నిపుణులు సూచించనున్నారు. ఈ దిశగా రైతులకు శాస్త్రీయ వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించేందుకు సాలూర మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రత్యేక రైతు సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) ఆధ్వర్యంలో రుద్రూర్ లోని కృషి విజ్ఞాన కేంద్రం, జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ కళాశాల సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి.

ఈ సదస్సులో నాణ్యమైన విత్తనాల ఎంపిక, భూసార పరీక్షల ప్రాధాన్యత, పంటలకు అవసరమైన సమతుల్య ఎరువుల వినియోగం, చీడపీడల సమర్థ నివారణ, నీటి పొదుపు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాలను వివరించనున్నారు.

మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు విధానాలలో మార్పులు చేసుకుంటూ శాస్త్రీయ పద్ధతులను పాటిస్తే పెట్టుబడి వ్యయాన్ని తగ్గించు కోవడంతో పాటు మెరుగైన దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా తీర్చిదిద్దడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular