తాగునీరు ఇవ్వాలని ఖాళీ బిందెలతో ధర్నా.ములుగు నియోజకవర్గo వెంకటాపురం మండలం ముకునూరు పాలెం ఆదివాసి మహిళలు తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఖాళీ బిందెలతో భద్రాచలం – వెంకటాపూరం ప్రధాన రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. తాగునీటి కోసం వేసిన బోర్లు, మిషన్ భగీరథ పైపుల ద్వారా సక్రమంగా నీరు అందకపోవడంతో నీటి ఎద్దడి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని ఇప్పటికైనా మంత్రి సీతక్క మాగోడు ఆలకించి సమస్యను పరిష్కరించాలని మహిళా మణులు డిమాండ్ చేస్తున్నారు.