నిజాంబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని
చందూరు మండలం లోని లక్ష్మీ సాగర్ తాండా, మేడిపల్లి, లక్ష్మాపూర్, చందూరు గ్రామాలు మరియు పోతంగల్ మండలం లోని టాక్లీ, సోంపూరు, యాద్గార్ పూర్ గ్రామాలలో మూడు రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను ఈరోజు పరిశీలించి, రైతులతో మాట్లాడిన మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి .
ఈ సందర్భంగా పోచారం మాట్లాడతూ బాన్సువాడ నియోజకవర్గంలోని చందూరు, పోతంగల్, కోటగిరి మండల లోని కొన్ని గ్రామాలలో మూడు రోజుల క్రితం కురిసిన అకాల వర్షం, వడగండ్ల వానతో నోటికొచ్చిన పంట దెబ్బతిన్నది.
ప్రకృతి వైపరీత్యాలతో జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది.
రైతుల బాధ చూస్తుంటే ఒక రైతుగా నాకు చాలా బాధ కలుగుతుంది.
సర్వే చేసి పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపాలని అధికారులకు సూచించాను.పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25,000 ల నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.