Wednesday, February 11, 2026

బాన్సువాడ లో అనుమతి లేని కోచింగ్ సెంటర్లు

జిల్లా విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు అనుమతులు లేకుండా నడుస్తున్న కొన్ని కోచింగ్ సెంటర్లు*(ఏ ఐ ఎస్ బి) జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ డిమాండ్*బాన్సువాడ డివిజన్ పరిధిలో ఉన్న కోచింగ్ సెంటర్లు జిల్లా విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్న కోచింగ్ సెంటర్ యాజమాన్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లా విద్యాధికారి మరియు మండల విద్యాధికారి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ డివిజన్ పరిధిలో ఉన్న కొన్ని కోచింగ్ సెంటర్లు విద్యాశాఖ నిబంధనలకూ విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్లు రాగానే విచ్చాలవిడిగా రాష్ట్ర ప్రభుత్వ జిల్లా విద్యాశాఖ అనుమతులు లేకుండానే నిబంధనలు విరుద్ధంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని నిరుద్యోగులు,విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు దోచుకుంటున్నారని ఆయన అన్నారు.మరియు నిరుద్యోగులు,విద్యార్థులకూ వల వేసేందుకు తప్పుడు ర్యాంకులతో,కరపత్రలు,ప్లెక్సీలతో తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్న కోచింగ్ సెంటర్లనూ వెంటనే సిజ్ చేయాలని ఆయన జిల్లా ఉన్నత అధికారులనూ,జిల్లా విద్యాశాఖ అధికారులనూ కోరారు,లేని పక్షంలో తప్పుడు ప్రచారం చేస్తున్న కోచింగ్ సెంటర్లపై మా ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular