Wednesday, February 11, 2026

నేను పక్క లోకల్….

press release date 15/04/2024

బుల్లెట్ దిగిన..బుల్లెట్ కు భయపడని..వ్యక్తిని.

సిరికొండ, బాల్కొండ ప్రాంతా ప్రజలు రాజకీయంగా ఎదగడానికి పునాదులు వేశారు..

బుట్టచోరు బుడేర్ఖాన్ మాటలు…’ఆరు గ్యారెంటీ’లతో.. ప్రజలను వంచించిన కాంగ్రెస్ పార్టీ…

ఆశీర్వదించండి సేవకుడిగా పనిచేస్తా పార్లమెంట్ సమావేశాలు నడిచినప్పుడు ఢిల్లీకీ.. మిగతా రోజులు నిజామాబాద్ జిల్లా ప్రజల వద్దనే ఉంటా…

పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్దన్ పైర్….

భీంగల్ మున్సిపల్ కేంద్రంలో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో

బాల్కొండ నియోజకవర్గం: బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం భీంగల్ మున్సిపాలిటీ సన్నాహక బిఆర్ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, రాజ్యసభ ఎంపీ కే,ఆర్, సురేష్ రెడ్డి గారు, పాల్గొన్నారు.

బాల్కొండ భీంగల్, ఏప్రిల్ 15: ఈ సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు మాట్లాడుతూ…. సిరికొండ, బాల్కొండ ప్రాంతా ప్రజలు రాజకీయ ఎదగడానికి పునాదులు వేశారు, సర్పంచ్ నుండి, ఎమ్మెల్యే వరకు, రాజకీయంగా ఎదగడానికి. సరికొండ బాల్కొండ ప్రాంత ప్రజలే కారణం… అని ఆయన పేర్కొన్నారు, నేను పక్కా లోకల్… బుల్లెట్టు దిగిన.. బుల్లెట్ కు ఎదురు నిలబడి ప్రాణాలకు తెగించి… నిలబడ్డ వ్యక్తిని… అని ఆయన గుర్తు చేశారు..కాంగ్రెస్ పార్టీ తూపాకిరామడు బుట్టచోరు… మాటలు…’ఆరు గ్యారెంటీ’లతో.. ప్రజలను వంచించిన కాంగ్రెస్ పార్టీ … నేటికీ 120 రోజులు గడుస్తున్న.. ఆరు గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం… కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఇస్తానని ఇవ్వలేదో… ప్రతి ఒక్క గ్రామంలో చర్చ పెట్టాలి… ప్రతి ఒక్క గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలి… పని ఆయన సూచించారు..పేద లకు కల్యాణలక్ష్మి కింద రూ. లక్షతోపాటు తులం బంగారం ఇప్పటి వరకు ఎందరికి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, మహిళలకు పెన్షన్, రైతులకు రుణమా ఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన కరు వైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఒక్కసారి కూడా కరెంట్ పోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నప్పటి నుంచి గ్రామాల్లో తరచూ కరెంట్ పోతుందని రైతులు తన దృష్టికి తీసుకవచ్చినారు బాజిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఎన్ని రోజులు పరిపాలిస్తుందో ఆ పార్టీ నాయకులకే తెలియదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడొద్దని, పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని అన్నారు. పార్టీ నుంచి వెళ్లిన వారి గురించి ఆలోచించకుండా గెలుపు కోసమే ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లా లని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు లకు 24 గంటల కరెంట్, ఇచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు. బాల్కొండ నుంచి అత్యధిక మెజార్టీ ఓట్లు రావాలని ఆకాంక్షిం చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తన గెలుపునకు పునాదులవుతాయని తెలిపారు. తనను ఆశీర్వదిస్తే ఢిల్లీలో తెలంగా ణపై మాట్లాడే అవకాశం ఉంటుందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచిం చారు.

స్థానికంగా ఉన్న నిజమాబాద్ ఎంపీ చేసింది శూన్యం.. ఏ ఒక్క గ్రామానికి వెళ్లి చేసిందిలేదు, సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారాలు చెప్పడం తప్ప ప్రజలకు చేసింది శూన్యం, ఐదు రోజుల్లో తెస్తానన్న పసుపు బోర్డు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా రాలేదు.. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు నిలదీయండి ఎండగట్టండి కాంగ్రెస్ బిజెపి పార్టీల నాయకుల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని ఎంపీ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్థన్ గారు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular