ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా
కోరుట్లలో ఎన్నికల ప్రచారం చేపట్టిన బాజిరెడ్డి
పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆదరిస్తే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని బి ఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.
కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మహిళలు మంగళాహరతులతో ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో వారితోపాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ , కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ,జగిత్యాల జిల్లా బీఆర్ఏస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , జగిత్యాల్ జిల్లా పరిషత్ చైర్మన్ వసంత , మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
