కేసును ఛేదించిన పోలీసులు అభినందించిన పోలీస్ కమిషనర్క్రైమ్ నెంబర్ : 156/2024 U/Sec 302, 394, 201 IPC ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ధర్యాప్తు అధికారులు :జి. బస్వా రెడ్డి, ACP-ఆర్మూర్ ఆద్వర్యం లో వి. రవి కుమార్, ఇన్స్ పెక్టర్ అఫ్ పోలీస్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్మృతురాలు రాసురి లాస్య @ నవనీత W/o రాకేశ్, వయ్యస్సు: 22 సం,,లు, కులం: గోసంగి, వృత్తి: గృహిణి R/o సంతోష్ నగర్ ఆర్మూర్ అల్లెపు మల్లయ్య @ రాజు @ అల్లెపు పోసానిపల్లి చిన్న మల్లయ్య @ పందుల మల్లయ్య S/o నర్సయ్య, వయ్యస్సు: 55 సం,,లు, కులం: వడ్డెర, వృత్తి: రాయి కొట్టుట R/ యాడారం గ్రామం, దోమకొండ మండలం కామారెడ్డి జిల్లా, ప్రస్తుత నివాసం బీడీ వర్కర్స్ కాలనీ, నాగారం నిజామాబాద్. నేరస్థుడుని అరెస్టు చేసిన తేదీ మరియు స్థలము: తేదీ: 18.04.2024 నాడు ఉదయం 10 గంటల ప్రాంతంలో నాగారం లోని నేరస్థుడు/ అల్లెపు మల్లయ్య ఇంటి వద్ద. నేరస్థుడి నుండి స్వాదీనం చేసుకున్న బంగారు వస్తువుల యొక్క వివరములు : 1) బంగారు పూస్తేల త్రాడు, దీని బరువు సుమారు 20 గ్రాములు 2) ఒక బంగారు చైను, దీని బరువు సుమారు 5 గ్రాములు3) ఒక జత వెండి పట్ట గొలుసులు, వీటి బరువు సుమారు 71.5 గ్రాములు మొత్తం 25 గ్రాముల బంగారం మరియు 71.5 గ్రాములు వెండి 5) చంపడానికి ఉపయోగించిన ఒక కొడవలి కేసు యొక్క వివరములు నేరస్థుడు/అల్లెపు మల్లయ్య @ రాజు @ అల్లెపు పోసానిపల్లి చిన్న మల్లయ్య @ పందుల మల్లయ్య సుమారు ఏడు సంవత్సరాల క్రితం మృతురాలి ఇంట్లో కిరాయికి ఉండి వెళ్ళిపోయినక అతను తరచూ వారి ఇంటికి వచ్చి పోతుండేవాడు. ఈ క్రమంలో మృతురాలి ఒంటిపై గల బంగారు ఆభరణాలను చూసిన నేరస్థుడు, మృతురాలిని ఎలాగైనా చంపేసి ఆమె మెడలోని బంగారు ఆభరణాలను దొంగిలించాలనే ఉద్దేశ్యంతో, తేదీ 23.03.2024 నాడు నేరస్థుడు మధ్యాహ్నం పూట మృతురాలి ఇంటికి వెళ్ళగా ఇంట్లో మృతురాలు ఒంటరిగా ఉన్నది చూసి, నేరస్థుడు అదే అదునుగా భావించి ఆమె గొంతుపై ఇంట్లోనే గల కొడవలితో బలంగా పొడిచి చంపి, ఆమె మెడలోని బంగారు పూస్తేల త్రాడు, ఒక బంగారు చైను మరియు ఒక జత వెండి పట్ట గొలుసులను దొంగిలించుకుని పోయినాడు. CC కెమెరా మరియు పాత నేరస్థుల రికార్డుల ఆధారముగా తేదీ 18.04.2024 నాడు నేరస్థుడ్ని అతని ఇంటి వద్ద ఉదయం అందాజ 7 గంటల ప్రాంతములో పట్టుకుని, అతన్ని విచారించగా తను చేసిన నేరమును ఒప్పుకున్నాడు. ఇతనిపై ఇదివరకే (3) దోపిడి హత్య కేసులు, (11) రాబరీ కేసులు కలవు. ఇట్టి కేసు ధర్యాప్తులో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆధెశాల మేరకు జి. బస్వా రెడ్డి, ACP-ఆర్మూర్ గారి ఆద్వర్యం లో వి. రవి కుమార్, ఇన్స్ పెక్టర్ అఫ్ పోలీస్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యములో పలు టీము లుగా ఏర్పడి CC కెమెరాలు పరిశీలించి, పాత నేరస్థుల రికార్డుల ఆధారముగా నేరస్థుడుని గుర్తించి, తేదీ 18.04.2024 నాడు నేరస్థుడ్ని అతని ఇల్లు నిజామాబాద్ లోని నాగారం వద్దగల బీడీ వర్కర్స్ కాలనీలో ఉదయం అందాజ 7 గంటల ప్రాంతములో పట్టుకుని, అతన్ని విచారించగా తను చేసిన నేరమును ఒప్పుకున్నాడు. ఇతనిపై ఇదివరకే (3) దోపిడి హత్య కేసులు, (11) రాబరీ కేసులు కలవు. బస్వా రెడ్డి, ఏసిపి-ఆర్మూర్ ఆద్వర్యం లో వి. రవి కుమార్, ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మూర్, మచ్చెంధర్ రెడ్డి SIP ఎర్గట్ల, మరియు తిరుపతి, HC 1549 ఆర్మూర్ PS, పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ అయిన గంగా ప్రసాద్ PC 1699, D. ప్రసాద్ PC 1899,R. శ్రీకాంత్ గౌడ్ PC 967, P. రాజేశ్వర్ PC 2149 లను నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, ఐ.పీ.ఎస్ అభినందించి వీరికి రివార్డు లు ఇవ్వడం జరిగింది.
ఆర్మూర్ లో మహిళా హత్య కేసులో వ్యక్తి అరెస్టు
RELATED ARTICLES
