ముందుచూపు క్రమశిక్షణ విషయ పరిజ్ఞానం అవగాహన బాధ్యత దీర్ఘకాలిక ప్రయోజనాలు అభివృద్ధి అనుభవం నారా చంద్రబాబు నాయుడు గురించి క్లుప్తంగా చెప్పాలంటే నాకు గుర్తొచ్చే అంశాలు ఇవే!
బాబు అనగానే గుర్తొచ్చే పథకం పేరు ఒకటి చెప్పండి అని గతంలో ఒక విద్యావంతుడు అడిగిన ప్రశ్న- పథకం అంటే తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాలు కల్పించేవి కాకుండా దీర్ఘకాల_ప్రయోజజనాలు ఉండేవి అయితే పేరుతో ప్రాచుర్యం పొందనివి వివిధ వర్గాల జనానికి శాశ్వత ప్రయోజనం కల్పించినవి చాలా ఉన్నాయి అని చెప్పా. ఏవో రెండు మూడు పథకాల పేర్లు చెప్పి ఆ రెండింటితోనే ప్రచారం కాకుండా అన్ని వర్గాల ప్రజలకు శాశ్వత ప్రయోజనాలు కలగాలి భావితరాలకు ఉపయోగం ఉండాలి అనే రీతిలో పథక రచన చేసి పాలించారు బాబు. అలా అని కేవలం అభివృద్ధి మాత్రమే కాకుండా అవసరమైన సంక్షేమం కూడా తక్కువేం చేయలేదు. మానవుడు గర్భంలో ఉన్నప్పటి నుండి మట్టిలో కలిసి పోయేవరకు ప్రభుత్వం బాధ్యతగా ఏం చేయాలో అన్నీ చేసేలా రూపకల్పన చేశారు. దురదృష్టం ఏంటంటే సంక్షేమం అంటే పప్పులు బెల్లాలు అనే స్థాయికి దిగజారిన దుస్థితిలో ఉన్నాం.వెన్నుపోటు ఫిరాయింపులు ఓటుకు నోటు పొత్తులు ఈ నాలుగింటిలో బాబు ఇమేజ్ రాజకీయంగా డామేజ్ చేసుండొచ్చు కానీ బాబు ముందుచూపుతో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు నాడు ఆచరించిన పద్ధతులు భేష్! బాబుని కొన్ని అంశాల్లో రాజకీయంగా విమర్శించవచ్చు గాని సమర్థతపై ప్రశ్నించే విమర్శించే అవకాశం లేదు..!

సంస్కరణలు అంటే ధరలు పెంచటం అనే రీతిలో కాకుండా సౌకర్యాలు నాణ్యత సేవలు మెరుగుపరచడం అని చేసి చూపించారు – ఆర్టీసీ విద్య విద్యుత్ సంస్కరణలు భేష్. ఆర్టీసీ లో సౌకర్యాలు మెరుగుపరచారు ఆక్యుపెన్సీ పెంచారు బస్టాండు ఆవరణలో నిర్మాణాలు ఆస్తుల విలువ పెంచారు కొరియర్ సర్వీస్ తేవటం ఆదాయం పెంచి నష్టాలు తగ్గించారు. ఏడేళ్ల క్రిందటే సౌర విద్యుత్ వైపు అడుగులు. 24 గం.లు నాణ్యమైన విద్యుత్! వ్యవసాయానికి నీటి వినియోగం తగ్గించే బిందుసేద్యం భూగర్భ జలాలు పెంచే చెక్డ్యాం భూసారం పెంచి ఆరోగ్యమైన విషరహితమైన పంట అందించే #ప్రకృతిసేద్యం ఇపుడు దేశం మొత్తం అమలు చేస్తున్నారు. ఇపుడు నాడు నేడు అని గొప్పగా చెబుతున్నారు కానీ గత హయాంలో ఎన్నారై సహకారంతో వందల పాఠశాలలు సాంకేతిక హంగులతో ఆధునీకరణ! శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు అందించే హైటెక్ సిటీ. మూడు ప్రాంతాలకు సమదూరంలో రాజధాని రాయలసీమలో పరిశ్రమలు ఉత్తరాంధ్రలో ఐటీ మూడు ప్రాంతాల్లో అభివృద్ధివికేంద్రీకరణ మచ్చు తునకలు. వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో అగ్రగామిగా నిలుపుతూనే ఉత్పత్తుల విలువ పెంచి ఆర్థిక స్వావలంబన! గ్రామాల్లో విద్యుత్ వెలుగులు దేశ సగటు కన్నా ఎక్కువగా 41.46km/ 1000 km రహదారుల నిర్మాణం. 93వేల నుంచి 1.6 లక్ష వరకూ తలసరి ఆదాయం పెంపు.. ఇలా చాలా! రాళ్లలో విశ్వనగరం హైటెక్సిటీ నిర్మించారు ఇప్పటికీ వేల ఉద్యోగాలకు అది ఒక కల్పతరువుగా మిగిల్చారు. దీపం గ్యాస్ పథకంతో వంటింట్లో మహిళల కంట కన్నీరు తగ్గించారు.మహిళలకు డ్వాక్రా ఆత్మవిశ్వాసం పెంచుతుంది ఒక భరోసా ఇస్తుంది! అభివృద్ధికి ప్రధాన మంత్రం రవాణా వ్యవస్థ అని ఆనాడే గుర్తించి పల్లె పల్లెకి రోడ్లు వేయించి బస్సులకు బాటలు వేశారు! విభజనలో నష్టపోయినా కేంద్ర సహకారం అంతంతమాత్రమే అయినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింప చేశారు ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు హుద్ హుద్ తిత్లీ కష్టం వచ్చినప్పుడు ఆదుకున్నారు రాయలసీమలో పరిశ్రమలు మధ్యలో రాజధాని ఉత్తరాంధ్రలో సాఫ్ట్వేర్ ప్రాంతీయ న్యాయం పాటించారు.మన రాష్ట్ర ఖజానాతో ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప కాదు ఇతర దేశాల వారు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించి తద్వారా లక్షల ఉద్యోగాలు కల్పించడం గొప్ప విషయం! సెల్ కాన్ హీరో కియా అశోక్ లేలాండ్ మెడిటెక్ హెచ్ సీఎల్ అపోలో ఇలా ఎన్నో పరిశ్రమలు #ఐటీ కంపెనీలు తెచ్చి చదువుకుంటే ఉద్యోగం దొరుకుతుంది అనే భరోసా యువతకి ఇచ్చారు.యువత అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకోవటం వారి స్వయంకృతాపరాధం! అప్పట్లో బాబు ఆలోచనలు నమ్మిన వారు కనీసం పాతికవేలకు పైగా జీతంతో హైటెక్ ఉద్యోగాలు సాధించారు అత్యాశకు పోయిన నేటి యువత ఐదువేల వాలంటీర్లు పదిహేను వేల మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు పొంది సంతృప్తి పొందుతున్నారు వారి దౌర్భాగ్యం అనుకోవటం మినహా చేయగలిగింది ఏమీ లేదు సంక్షేమం అమలుచేస్తూనే అభివృద్ధి వైపు అడుగులు వేశారు.ఒక్కమాటలో విభజన తర్వాత మనకేముంది అనే స్థాయి నుంచి మనకేం_తక్కువ అనే స్థాయికి తెచ్చారు! కుల పిచ్చి వ్యక్తిగత ద్వేషం వలన పైకి అంగీకరించకపోవచ్చు కానీ తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాలు కల్పించే ఉచిత పథకాలు ఎప్పటికీ జనం జీవితాన్ని మార్చలేవు మార్చవు మార్చబోవు! తాత్కాలిక ప్రయోజనాలు ఆశించే వ్యక్తులకు బాబు దీర్ఘకాలిక ప్రయోజన ఆలోచనలు ఎప్పటికీ అర్థం కావు కాబోవు కానీ ఎప్పటికైనా అవే ఆ ఆలోచనలే ఆచరణీయం అభినందనీయం. రాష్ట్రం బాగుండాలి మళ్ళీ పునర్వైభవం రావాలి అంటే బాబు మళ్లీ రావాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.
