-కామారెడ్డి మున్సిపల్ లో నాయకుల తీరే వేరు.
పార్టీలు వేరైనా ఆ నేతలందరూ ఒకటి
వారి మాట వినకుంటే ఉద్యోగాలు ఊడినట్టే
పార్టీ అధికారంలో లేకున్నా వారి మాట చెల్లుబాటే
కార్మికులు మునిసిపల్ లో వేతనాలు పని మాత్రం నాయకుల ఇండ్లలో
దాదాపు 60 మంది కార్మికులు రాజకీయ నాయకుల ఇన్డ్లలోనే పని
కార్మికులంటే అధికారులకి ఎందుకంత చులకన…..?
మాజీ కమిషనర్ కి ప్రస్తుత కమిషనర్ మద్దతు పలకుతున్నారా..?
కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్మికుల ని స్వంత పనులకు ఉపయోగించుకుంటున్న కామారెడ్డి రాజకీయ నాయకులు ప్రస్తుత కౌన్సిలర్స్ మాజీ కౌన్సిలర్స్ ఇండ్లలో పాచి పని చేయడానికి దాదాపుగా 60 మంది కార్మికులను ప్రతి రోజు అదే పనిగా వారితో పని చేయించుకుంటున్న నాయకులు వారికి వేతనాలు మాత్రం మునిసిపల్ కార్యాలయం నుండి ఇస్తారు పని మాత్రం ఇండ్లలో చేయాలని ఇంత జరుగుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నా అదికారులు గతంలో కమీషనర్ గా పనిచేసిన దేవేందర్ గత మూడు నెలల క్రితం బదిలీపై రామాయణపేట కి వెళ్ళినా ప్రస్తుతం కామారెడ్డి లో అయన నివాసంలో ఇంటి పనులు మాత్రం మున్సిపల్ లో పని చేస్తున్న కార్మికల తో పని చేయుంచుకుంటున్నా.. వాస్తవానికి మున్సిపల్ కార్మికులు మున్సిపల్ పర్దిలో తప్ప ఎ ఒక్క అధికారి ఇంటి దగ్గర కానీ, రాజకీయ నాయకుల ఇంటి వద్ద కానీ పని చేయడానికి లేదు… కానీ కామారెడ్డి మున్సిపల్ మాజీ కమిషనర్ దేవేందర్ దీనికి విరుద్దంగా చేస్తున్నారు. శనివారం ఉదయం సుమారు ఉదయం 5 గంటల సమయంలో మాజీ కమిషనర్ దేవేందర్ నివాసంలో మున్సిపల్ లేబర్ మరియమ్మ పని చేస్తున్న సమయంలో మరియమ్మ ని మీడియా ప్రతినిధలులు ప్రశ్నించగా మరియమ్మ మాత్రం నన్ను మా మున్సిపల్ జవాన్ పంపించడాని చెప్పారు. వెంటనే విషయం తెల్సుకున్న మాజీ కమిషనర్ దేవేందర్ అడవిడిగా ఇంటిలో నుండి బయటకి వచ్చి అవును నేనే తెప్పించుకున్నాను.. అంటూ సమాధానం ఇవ్వగ.. ఒక మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వాలు మారిన, మున్సిపల్ కమిషనర్ మారిన ప్రవర్తన మాత్రం మారడం లేదు.ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్కి మున్సిపల్ లో ఎవరెవరు ఏం విధులు నిర్వహిస్తున్నారో ఎక్కడ చేస్తున్నారో తెలియని స్థితిలో ఉన్నరా… అంటే ఇదంతా రాజకీయ నాయకుల ,మరియు అధికారుల అండదండలతో నడుస్తున్నాయని కామారెడ్డి లో ఉన్న పెద్ద నాయకుల ఇండ్లలో మాజీ మున్సిపల్ చైర్మన్ , మాజీ ఎమ్మెల్యే లు , ప్రస్తుత చైర్మన్ వివిధ పార్టీల జిల్లా అధ్యక్షలా ఇండ్లలో మునిసిపల్ కార్మికులతో పని చేయించుకుంటున్న పట్టించుకొనే అదికారులు లేకుండా పోయారు. కామారెడ్డిలో మార్పు కోసం ఇక్కడ పోటీ చేసిన ఇద్దరు ముఖ్యమంత్రి కుడా కాదని బీజేపి అభ్యర్ధిని గెలిపించిన ప్రజలు వారు కోరుకునే విధంగా జరిగేనా …? లేదా..? ఇప్పటి వరకు నాయకుల ఇండ్లలో పనిచేస్తున్న కార్మికుల వివరాలు స్ధానిక ఎమ్మెల్యే రమణ రెడ్డి దృష్టికి వెళ్ళలేదా… వెళ్లిన కుడా చూసి చూడనట్టు ఉన్నారా.. అనేదాని పైనా కామారెడ్డి ప్రజల మధ్య చర్చ జరుగుతుంది..
