Thursday, February 12, 2026

హన్ మాన్ శోభయాత్ర నగరంలో ట్రాఫిక్ మళ్లింపు పోలీస్ కమీషనర్ వెల్లడి

హనుమాన్ జయంతి పురస్కరించుకొని నిజాంబాద్ పట్టణంలో నిర్వహించబోయే శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నట్లు మిషనరీ ఆఫ్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. నిజామాబాద్ నగర ప్రజలకు 23-4-2024 నాడు ఉదయం నుండి రాత్రి వరకు హనుమాన్ జయంతి శోభయాత్ర చేపడతారు. ఇట్టి శోభయాత్ర కంఠేశ్వర్ ఆలయం నుండి ,జిల్లా పరిషత్ చౌరస్తా హమాల్వాడి, పాత ప్రభాత్ టాకీస్, లలితామాహాల్ రైల్వే గేట్, గంజ్ గేటు నెంబర్ 2 గోదాం రోడ్డు, దేవి రోడ్డు మమతా సర్కిల్ గాంధీచౌక్ , నెహ్రూ పార్క్ , ఆజాం రోడ్డు పెద్దపోస్టాఫీస్ , పెద్దబజార్ , లక్ష్మీ మెడికల్ , పోతలింగన్న దేవాలయం , రాజరాజేంద్ర చౌరస్తా వరకు చేరుకుంటుంది. ఇట్టి శోభయాత్రలో దేవత విగ్రహములు ఊరేగింపు సందర్బంగా పెద్దసంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొనే అవకాశం ఉన్నందున ముఖ్యంగా లలితామాహల్ రైల్వేగేట్ , గంజ్ గేట్ నెంబర్ 2, గోదాం రోడ్డు , దేవి రోడ్డు , మమతా సర్కిల్ , గాంధీచౌక్ , నెహ్రూ పార్క్ , ఆజాం రోడ్డు , పెద్దపోస్టాఫీస్ , పెద్దబజార్, లక్ష్మీ మెడికల్, పోతలింగన్న దేవాలయం , రాజరాజేంద్ర చౌరస్తా వరకు గల దుకాణ యాజమానులు మరియు నివాసం ఉండే వారు తేది 22-4-2024 నాడు రాత్రి 8 గంటల నుండి తేది: 24-4-2024 నాడు ఉదయం 6 గంటల వరకు వాహనాలను శోభయాత్ర వేళ్లే మార్గంలో రోడ్డు పైన పార్కింగ్ చేయరాదు. మరియు ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలిగించరాదని నిజాంబాద్ పోలీసులు సూచించారు.
హైదరాబాద్ నుండి వచ్చి పోయే వాహనాలు
ఆర్.టి.సి బస్ స్టాండ్ నుండి రైల్వే స్టేషన్, ఎన్. టి. ఆర్ చౌరస్తా , కంఠేశ్వర్ బై పాస్ , నుండి మాధవనగర్ బైపాస్ చేరుకోవాలి.
బోధన్ నుండి వచ్చి పోయే వాహనాలు అర్సాపల్లి రైల్వే గేట్ నుండి కొత్త కలెక్టరేటు , కంఠేశ్వర్ బై పాస్ , నీలకంఠేశ్వర్ దేవాలయం , ఎన్.టి.ఆర్ చౌరస్తా , కోర్టు సర్కిల్, గ్లామర్ , రైల్వే స్టేషన్ నుండి ఆర్.టి.సి బస్ స్టాండ్ చేరుకోవాలి. బాన్సువాడ నుండి వచ్చి పోయే వాహనాలు వర్ని చౌరస్తా నుండి పులాంగ్ సర్కిల్ కోర్టు సర్కిల్ ఎన్.టి.ఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్ నుండి ఆర్.టి.సి బస్ స్టాండ్ చేరుకోవాలి.ఆర్మూర్ నుండి వచ్చి పోయే వాహనాలు* కంఠేశ్వర్ బై పాస్ , కంఠేశ్వర్ దేవాలయం , ఎన్.టి.ఆర్ చౌరస్తా , కోర్టు సర్కిల్, గ్లామర్ , రైల్వే స్టేషన్ నుండి ఆర్.టి.సి బస్ స్టాండ్ చేరుకోవాలి. ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి ప్రయాణాలు జరుపుకొని ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించాలని మనవి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular