Thursday, February 12, 2026

గులాబీ దళపతి కేసీఆర్ బస్సు యాత్ర

గులాబీ దళపతి తెలంగాణ ఉద్యమ సారధి బీఆర్‌ఎస్‌ అధినేత, తెలం గాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రాష్ట్రవ్యా ప్తంగా చేపట్టే బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కాను న్నది.
ఈ నేప‌థ్యంలో కేసీఆర్ యాత్ర కొన‌సాగించ‌బోయే బ‌స్సుకు తెలంగాణ భ‌వ‌న్‌ లో మంగ‌ళ‌వారం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ పూజా కార్య‌క్ర‌మాల్లో గులా బీ శ్రేణులు పాల్గొన్నారు.
నేటినుండి వరుసగా 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నది. మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది.మిర్యాలగూడలో ప్రారంభ మై సిద్దిపేటలో జరిగే బహి రంగసభతో ఈ యాత్ర ముగుస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్‌ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజక వర్గాల్లో రోడ్‌షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్‌ చేశారు.
తమ నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్‌ బస్సు యాత్ర చేయాలంటూ వివిధ నియో జకవర్గాల నేతల నుంచి డిమాండ్‌ వస్తున్నది. అయితే, సమయం తక్కువగా ఉండటం, ఎండ వేడి దృష్ట్యా కొన్ని నియోజక వర్గాల్లోనే బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular