పార్లమెంటు ఎన్నికలలో భాగంగా బహుజన లెఫ్ట్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా నిజామాబాద్ పార్లమెంటు నుండి అబ్బగోని అశోక్ గౌడ్ జిల్లా పాలనాధికారి రిటర్నింగ్ ఆఫీసర్ కి నామినేషన్ వారాలు అందించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో బహుజన లెఫ్ట్ పార్టీ నుండి అబ్బగోని అశోక్ గౌడ్ బాల్కొండ నియోజకవర్గం నుండి పోటీ చేశారు.
అదేవిధంగా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల కు విద్య, వైద్య ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారని వారికి అన్ని విధాలుగా అండగా నిలబడే ఏకైక పార్టీ బహుజన లెఫ్ట్ పార్టీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి సబ్బని లత, ఎం సి పి ఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, ఎం సి పి ఐ నాయకులు రాజేశ్వర్, బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు జగదీశ్వర్, బహుజన లెఫ్ట్ పార్టీ విద్యార్థి సంఘం నాయకులు సాయికుమార్
తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా అబ్బగొని నామినేషన్
RELATED ARTICLES
