సీఎం సవాల్ ని నేను స్వీకరిస్తున్నా
సంగారెడ్డి పట్టణంలో సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది.
ఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్దకి నేను వస్తా.
ఆగస్ట్ 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తానని ప్రమాణం చెయ్యి తన డిమాండ్ చేశారు. ఆగస్ట్ 15 లోపు పూర్తిగా రుణమాఫీ చెయ్యాలి ఒకవేళ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..మళ్ళీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయను. మీరు చెయ్యకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.
నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
