వరంగల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జన జాతర సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
వరంగల్ ప్రజల అండతో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు.ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతీ గ్రామానికి నీళ్లు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిది. ఇండస్ట్రియల్ కారిడార్ ను నెలకొల్పి నిరుద్యోగ యువకులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తాం.
వరంగల్ లో టెక్స్ టైల్ పార్కును అభివుద్ది చేస్తాం.
వరంగల్ లో ఎయిర్ పోర్టు అభివృద్ధి చేసి మహర్దశ కల్పిస్తాం.వరంగల్ నగరాన్ని పట్టి పీడిస్తున్న చెత్త సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం.
నేనే స్వయంగా వచ్చి వరంగల్ లో కూర్చుని నగర సమస్యలను పరిష్కరిస్తానని జన జాతర సభలో ముఖ్యమంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు.కాకతీయ యూనివర్సిటీకి కొత్త వీసీని నియమించి యూనివర్సిటీని ప్రక్షాళన చేస్తాం.ఉత్తర తెలంగాణ అంతా వరంగల్ వైపుచూసేలా నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది.
*మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారు.
*అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్… నిన్న నాలుగు గంటలు టీవీ స్టుడియోలో కూర్చున్నాడు.
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మందేసి గీశాడో.. దిగాక గీసాడోగానీ కూలిపోయింది.కేసీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా… నువు కట్టిన కాళేశ్వరం అద్భుతమైతే చర్చకు రా. నీకు దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరంపై చర్చకు రా. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసి ఆత్మహత్యలు ఆపుతానని మోదీ హామీ ఇచ్చారు. కానీ ఆత్మహత్యలు ఆగలేదు.. రైతుల ఆదాయం పెరగలేదు. జన్ ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానన్న మోదీ మోసం చేశారు.బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకుండా ఈ ప్రాంతానికి మోదీ మోసం చేశారు. కాజీపేటకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తరలించుకుపోయారు. బీజేపీ నేతలకు మత పిచ్చి పట్టుకుంది.భూములు ఆక్రమించుకున్న ఆరూరి రమేష్ అంగీ మార్చి, రంగు మార్చి వస్తుండు.ఏ రూపంలో వచ్చినా.. ఏ వేషంలో వచ్చినా ఆరూరి రమేష్ ను ప్రజలు బండకేసి కొడతారు అని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
*భూములు ఆక్రమించుకునే ఆరూరి రమేష్ కావాలో పేదలకు వైద్యం అందించే కడియం కావ్య కావాలో తేల్చుకోండి.కడియం శ్రీహరి నిజాయితీ చూసి పార్టీలో చేర్చుకున్నాం.ఈ ప్రాంతం నుంచి మరొక ఆడబిడ్డ కావ్యను ఆశీర్వదించండి.
ఆరూరి రమేష్ కు ఓటు వేస్తే.. అనకొండగా మారి మీ భూములను మింగేస్తాడు. *నిజాయితీని వారసత్వంగా తీసుకున్న…మీ కోసం కొట్లాడే కావ్యను గెలిపించండి.
వరంగల్ ను అభివృద్ధి చేసే బాధ్యత నాది.పోలింగ్ బూత్ లో ఓట్ల కోసం దేవుడి పేరు చెప్పుకోవద్దు.దేవుడు గుడిలో ఉండాలి… భక్తి గుండెల్లో ఉండాలి.*రామప్ప శివుడి సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా, భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాట ఇస్తున్నా.
పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తా.
హరీష్ రావు… రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని రెడీగా ఉండు.పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తెలుస్తాం.ఆనాడు పెట్రోల్ పోసుకున్న నీకు అగ్గిపెట్టే దొరకలేదని చెప్పినట్లు కాదు.




