Friday, February 13, 2026

జహీరాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయం

మోదీపై నమ్మకంతోనే బీజేపీలో చేరికలు

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీ నారాయణ

జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో బిజెపి పార్టీ గెలుపు ఖాయమని బిజెపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బాన్సువాడ నియోజకవర్గం బిజెపి పార్టీ ఇంచార్జ్ యెండల లక్ష్మీనారాయణ ధీమా వ్యక్తం చేశారు. శనివారము కోటగిరి మండలం బస్వాపూర్ గ్రామం నుండి 20 మంది యువకులు యెండల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు. కోటగిరి మండల బిజెపి పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి ఎండల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి అవ్వడం ఖాయమని జహీరాబాద్ లో బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ఆశ భావం వ్యక్తం చేశారు. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపిన నరేంద్ర మోడీ భవిష్యత్తులో దేశాన్ని మరింత ఉన్నత స్థితికి చేరుస్తాడని నమ్మకంతోనే భారత దేశ ప్రజలు నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. మోడీపై నమ్మకంతోనే బిజెపి పార్టీ లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయన్నారు. ప్రజలందరూ జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్ ను భారీ మెజారిటీతో గెలిపించి నరేంద్ర మోడీకి కానుక ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎంపీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు బిజెపికి ఓటేయాలని సంకల్పంతో ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు దొరబాబు సీనియర్ బిజెపి నాయకులు పుల్లేల మోహన్రావు, కోటగిరి మండల బిజెపి అధ్యక్షుడు ఏముల నవీన్, రామేశ్వర్ ,సంజు ,నితిన్ కళ్యాణ్, దత్త ,ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular