Friday, February 13, 2026

ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు

మృతి …ఒకరికి తీవ్ర గాయాలు బాన్సువాడ బస్ డిపో దగ్గర ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టగా ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు కిందపడడంతో ఎదురుగా వస్తున్న లారీ కిందపడి ఇద్దరికీ తీవ్ర గాయాలు. బాన్సువాడ ప్రతినిధి బాన్సువాడ మండల పరిధిలోని బస్ డిపో దగ్గర శుక్రవారం రాత్రి 10:30 కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు తన మిత్రుని పిల్లలకి ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ నుండి ద్విచక్ర వాహనంపై వెళ్లి ఆసుపత్రిలో పలకరించి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం. వివరాలు వాళ్ళకి వెళితే. నర్సుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామం చెందిన సాయికుమార్, బీర్కూరు మండలం చించోల్లి గ్రామం చెందిన మారుతి వరుసకు ఇద్దరు మామ అల్లు అవుతారు. శుక్రవారం రాత్రి వారి మిత్రుడు రమేష్ కుమార్తె అనారోగ్యంతో ఆసుత్రిలో ఉండగా , మామ అల్లుళ్లు ఆ చిన్నారిని పలకరించడానికి వెళ్లి తిరిగి వస్తుండగా, బాన్సువాడ బస్ డిపో దగ్గర వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది, ద్విచక్ర వాహనంపై ఉన్న సాయికుమార్, మారుతి కింద పడడంతో, వెనకాల నుంచి వస్తున్న లారీ వీరి కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలకు గురయ్యారు.  సాయికుమార్ నాచుపల్లి గ్రామానికి చెందిన యువకుడు తీవ్ర గాయాలతో ఐసీయూలో ఉండగా ,మారుతి అనే వ్యక్తి 34 హైదరాబాద్ చికిత్స నిమిత్తం వెళుతుండగా తుఫాన్ గ్రామం మార్గమధ్యంలో మృతి చెందినట్లు  కుటుంబ సభ్యుల నుంచి సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular