Friday, February 13, 2026

బోధన్ లో మేడపాటి ఇంటింటి ప్రచారం

పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో అత్యధిక స్థానాలను బిజెపి దక్కించుకుంటుందని మూడోసారి కేంద్రంలో అధికారంలో రావడం మోడీ ప్రధానమంత్రి కావడం ఖాయమని బిజెపి రాష్ట్ర నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. భారతదేశంలో మోడీ వెలుగులు చిమ్మిస్తున్నారని కొంతమంది ఓర్చుకోలేక లేనిపోని ఆరోపణ చేయడం తగదని రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. శాసనసభ ఎన్నికల్లోనే బోధన్ నియోజకవర్గంలో 33 వేల ఓట్లను భారతీయ జనతా పార్టీ సంపాదించిందని పార్లమెంట్ ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గంలో మెజార్టీ ఓట్లను సాధించి తీరుతామన్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లొ భాగంగా బిజెపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కి మద్ధతు గా బోధన్ పట్టణంలోని 83,84,77,75,76,85 బూత్ ల్లో నిర్వహించిన ప్రచారం లో పాల్గొన్న బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి. మాట్లాడుతూ బీజేపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నరసింహా రెడ్డి, బోధన్ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజు, ప్రధాన కార్యదర్శులు. వాసు, ఆర్వింద్, సందీప్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్, సీనియర్ నాయకులు ధర్మన్న, సింధి విజయ్, గుంత గంగాధర్, సక్రే శివకుమార్, , కలికోటి కృష్ణా, కడిగే శివ , కార్యకర్తలు తదితరులున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular