Friday, February 13, 2026

బోధన్ కమ్మ సంఘం ఆవరణలో వంటశాలకు భూమి పూజ

పూజలు నిర్వహించిన కమ్మ సంఘం ప్రతినిధులు

బోధన్ కమ్మ సంఘం ఆవరణలో ఆదివారం వంటశాల నిర్మాణానికి భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. నిర్మాణ పనులకు బోధన్ కమ్మ సంఘం అధ్యక్షులు శివన్నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు. వేద పండితులచే పూజలు నిర్వహించారు. కమ్మ సంఘం ఆధ్వర్యంలో పలు సేవలు అందించేందుకు సంగం పాలకవర్గం పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. నిజాంబాద్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే బోధన్ కమ్మ సంఘం ఆదర్శవంతంగా నిలుస్తుంది. ఇప్పటికే పేద విద్యార్థులకు విద్యాబోధన తోపాటు భోజన వసతిని వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హరిబాబు, చందుర్ సుబ్బారావు, కొండలు, పావులూరి వెంకటేశ్వరరావు, రంగారావు, గాంధీ, లక్ష్మీ కాంతారావు, రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular