ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రెండు గంటలు అనే నినాదంతో నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 43 వ వారం ఉత్సాహంగా నిర్వహించారు. గత 43 వారాలుగా ప్రతి ఆదివారం అభివృద్ది కమిటి అద్వర్యంలో కాలనీలోని ఏదో ఒక ప్రాంతంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఆదివారం కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులు కలిసి రోడ్డు నెంబర్ 1లో ఉత్సాహంగా శ్రమదానం చేశారు. రోడ్డుకు ఇరువైపుల పెరిగిన చెట్ల కొమ్మలను కట్టర్ తో కత్తిరించారు. రోడ్డు పక్కనున్న ముళ్ల పొదలను తొలగించారు. వ్యర్థాలను, చెత్తాచెదారాన్ని ఒకచోట కుప్పగా పోసి నిప్పంటించారు. ఇరిగేషన్ గార్డెన్ పరిసరాలను కూడ పరిశుభ్రం చేశారు. ఈ సందర్బంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ మాట్లాడుతూ 43 వారాలుగా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కాలనీ వాసులకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలు చైతన్యవంతులై చెత్తను బయట ప పారేయకుండా మున్సిపల్ చెత్త బండిలో వేస్తున్నారని చెప్పారు. అందరి సహకారంతో జర్నలిస్ట్ కాలనీ స్వచ్ఛ కాలనీగా అవార్డు అందుకున్నామని ఆయన తెలిపారు. పార్టీలకు అతీతంగా నిధులు మంజూరు చేసి కాలనీలో జిమ్ ను ఏర్పాటు చేయాలని, కల్వర్టులు, మురికి కాలువలు నిర్మించాలని అధికార, ప్రతిపక్ష నాయకులను కోరారు. కాలనీ కోశాధికారి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఒకటో నెంబర్ రోడ్డులో నిర్వహించిన స్వచ్ఛ కాలనీ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఆదివారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కాలనీ అధ్యక్షుడు గోసికొండ అశోక్, ఉపాద్యక్షులు సుంకే శ్రీనివాస్, కొక్కెర భూమన్న, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, కార్యదర్శులురాజు, రాజ్ కుమార్, ఎర్ర భూమయ్య, ఎస్సారెస్పీ డి ఇ గణేశ్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

