పలు గ్రామాల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే
అణగారిన వర్గాలు నేడు పొందుతున్న ఉద్యోగ విద్యా అవకాశాలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పుణ్యమేనా అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. అణగారిన వర్గాలు డాక్టర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని సమాజాన్ని మరింత తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మద్నూర్ మండలం చిన్న ఎక్లార మరియు అవల్గావ్ గ్రామాలలో “డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలలో పాల్గొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారానే వెనకబడిన వర్గాలు రిజర్వేషన్లు పొంది ఆర్థిక సామజిక అభివృద్ధి చెందుతున్నారని
రాజ్యాంగ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. తాను నేడు జుక్కల్ కు ఎమ్మెల్యే కాగలిగేనానంటే అంబేద్కర్ పుణ్యమేనా అని తాను గర్వంగా చెప్తున్నాను అని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగంలో మార్పులు చేయాలని కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు రూపంలో వారికి తగిన బుద్ధి చెప్పి బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బడుగు బలహీన వర్గాలు ఆలోచన చేయకపోతే భవిష్యత్తులో తాము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే హెచ్చరించారు.
