Friday, February 13, 2026

ఎన్ టి ఆర్ కి నిజమైన నివాళి

తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే

తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు ప్రముఖులు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వారి యొక్క స్మారకార్థం వారి శతజయంతి సందర్భంగా 100 రూపాయల కరెన్సీని ఆర్బీఐ ముద్రించారు, ఈ రోజు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ పురపాలక సంఘం చైర్మన్ ఆనంద్ గౌడ్ తో కలిసి 100 రూపాయల ఎన్ టి ఆర్ కరెన్సీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారకరామారావు కి ఇది నిజమైన నివాళి అని తెలుగు వారందరికీ ఇది గర్వకారణం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, వెంకటయ్య, మురళి, యాదయ్య, కేశవులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular