షబ్బీర్ ఆలీ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ లో చేరిక
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి ఈ ప్రాంత అభివృద్ధికి నాయకుల అందరం కృషి చేస్తామని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు.
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి కల్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ , జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ హాజరయ్యారు. దోమకొండ మండల కేంద్రం నుండి వివిధ పార్టీలకు చెందిన సుమారు 300 మంది షబ్బీర్ అలీ సురేష్ శెట్కార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరినవారికి షబ్బీర్ అలీ , సురేష్ శెట్కార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పారు.
